Love gives Life

love-01

ప్రేమామృతం

 

అది ఒక అందమైన లోకమంట

          అందులో ఎల్లప్పుడూ సంతోషమేనట,

చుట్టూ రంగురంగుల పువ్వలంట

          మతిని పోగొట్టే మకరందమట,

అందులో వున్నది ఓ ప్రేమికులజంట

          వారు దాటారు ప్రేమలోకాలనట,

చేరుకొన్నారు చంద్రమండలమంట

          ఆడసాగారు ఉయ్యాలాట,

జారిపడ్డాడు ప్రేమికుడు

          వదిలాడు ప్రాణాలు,

అది చూసి పడ్డది ప్రేమికురాలు

          ప్రాణాలనే వదిలిన ప్రియురాలు,

అది చూసి విక్కి విక్కి ఏడ్చెను చంద్రుడంట , కనుల నిండా కన్నీరేనట

జారిపడ్డ చినుకలతో ఏర్పడినది ఓ సువాసనల సరస్సుఅంట , దాని పేరె అమృతమట.

 

నిజమైన ప్రేమ , ప్రేమ ప్రాణం పోయినా , ప్రాణం పోయిన ప్రేమకు ప్రాణం పోస్తుందే కాని ప్రాణం తీయదు.

          So my dear friends  మీది నిజమైన ప్రేమ అయితే  ప్రాణం పోయండి కాని ప్రాణం తీయొద్దు.                         

– Thomas Ssc

9866843163

 

Thought of the Day

                                                         సందేశం

 

          నా పేరు థామస్. నా దేశం భారతదేశం. నేను భారతీయుడుగా పుట్టినందుకు ఎంతగానొ గర్వపడుతున్నాను అదే సమయంలో నా ఈ భారతదేశం కోసం నేను ఏమి చేయలేక పోతున్నాను అన్నప్పుడల్లా నాలో ఏదో తెలియని బాధ , నాపై నాకే చిరాకేసి చనిపోవాలన్న కోపం కాని నా తల్లిదండ్రుల కోసం అది కూడా చేయలేక పోతున్నాను. భయమేస్తుంది నా దేశం ఏమవుతోoదన్న భయం ప్రతీక్షణం నరకంలా అనిపిస్తుంది. ఈ నా దేశంలో ప్రతి ఒక్కరూ స్వార్థపరులే , అందరూ నా కుటుంబం, నా వాళ్ళు , నేను బాగుంటె చాలనుకొనే స్వార్థం. పక్కవాడు ఆకలితో చచ్చినా , గాయాలపాలై ప్రాణాలకోసం పోరాడుతున్నా పట్టించుకోని జనం. ఆఖరికి ఉచితంగా లభించే నీరు ఇవ్వాలన్న స్వార్థం. ఇలా వుంటే మనం , మన దేశం  ఏమవుతోoదన్న దిగులు నా మదిని కలవరపెడుతుంది.

 

          ఆఖరికి ఎందరో మహానుబావులు కష్టపడి , ప్రాణాలు సైతం త్యాగం చేసి మనకోసం సంపాదించిన స్వాతంత్ర్యం సైతం వ్రుథా అవుతున్నందుకు చంపాలన్న కసి నాలో రగులుతుంది. స్వాతంత్ర్యం వచ్చి 68 సంవత్సరములు అయినప్పటికి ఓ మనిషి ఇద్దరు మనుషుల (బాడిగార్డ్స్) సాయంతో భయటకు వచ్చే దుస్థితి , రేయి-పగలు , ఎండ-వాన లేకుండా సరిహద్దులలో సైనికుల భద్రతను చూస్తే మనం బ్రతికే బ్రతుకుపై జాలి కలుగుతుందీ.

         

          ఇక దేశాన్ని రక్షించడానికి , దేశాభివ్రుద్ధికి యువకులు వున్నరనుకుంటే వారు జరిగిన విషయాలను తెలుసుకోవడానికే వారి జీవితం వ్యర్థమవుతున్నది , ఇక వారు ఎప్పుడు ప్రస్తుతం గురించి మరియు భవిష్యత్తు గురించి ఆలోచించాలో వాళ్ళకే తెలెయని పరిస్థితి. ఇది మనదేశ విద్యార్థుల పరిస్థితి. నేను అందరూ ఇలానే వుండారనడం లేదు, కాని మనలో చాల మంది అంటే ¾ వ వంతు ప్రజలు , విద్యార్థులు ఇలానే వున్నారు.

 

          ఇక మనదేశ రాజకీయ నాయకులు వారి పదవులను కాపాడుకోవడంలోనే వారి జీవితాన్ని గడిపేస్తున్నారు. వ్యాపారవేత్తలు , నటులు , వైద్యులు , న్యాయవాదులు —————- వారి వారి©ÁÇత్తులను నెరవేరుస్తున్నప్పటికీ దేశం కోసం పనిచేసే వారు లేరు.

 

          మారాలి , మనం మారాలి , మన సమాజం మారాలి , మన దేశం కోసం దేశంలోని నిర్జీవులు , సజీవులు అందరూ తోడ్పడాలి. మంచి విషయం చిన్నవాడు , పెద్దవాడు , ముసలోడు , అనుభవం వున్నోడు , అనుభవం లేనివాడు ఎవరు చెప్పిన వినే వుత్సాహం , ఆలోచన ఒక్క మనిషిలోనే కాకుండా ప్రజలందరిలో కలగాలి. అటువంటి వారు దినదినాభి©ÁÇద్ధి చెందాలి. నా ఈ నంభాషణ ఒక మనిషి వారి కోసమే కాక మరోకరి కోనం బ్రతకాలన్నదే. ముందుంది మంచి లోకం అని అందరూ తెలుసుకోవాలి. నేను అటువంటి వాడినే , కాని మీరు కూడా ఈ విధంగా మంచి విషయాలను ఆచరిస్తూ , నలుగుగికి వుపయోగపడుతూ , నలుగురిని ఆలోచింపజీస్తూ పైన చెప్పినట్లు వారిలా కాకుండా మనదేశ ప్రగతి కోసం పోరాడుతారని భావిస్తూ…………….

                                                                                        మీ

            – థామస్    

9866843163